గుంటూరు: అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు: మోదుగుల

13చూసినవారు
గుంటూరులో ఆదివారం వైసీపీ నేతలు ఎస్పీ సతీష్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నానికి పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర ప్రోద్బలమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగంతో అధికార వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్