త్రిబుల్ ఎక్స్ సోప్ అధినేత మాణిక్యవేలు మృతి చెందారు. గురువారం గుంటూరులో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆయన తమిళనాడు నుంచి గుంటూరు వచ్చి త్రిబుల్ ఎక్స్ సోప్ అనే వ్యాపార సంస్థ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగారు. గుంటూరు నగరంలో ఎంతోమందికి తన సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఎన్నో దైవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వితరణ చేశాడు.