గుంటూరు: నల్ల చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లచెరువు 12వ లైనులో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. నల్ల చెరువులో మృతదేహం ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు లాలాపేట పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించింది. మృతుని వివరాలు తెలియక పోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చరికి తరలించారు. మురదేహాన్ని గుర్తించిన ఎవరైనా లాలాపేట పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు తెలపవచ్చని ఈ పోలీసులు తెలిపారు.