వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రేపు (మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు YSRCP మహిళా విభాగం పిలుపునిచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగడం లేదని ఆరోపించింది. జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చి నిరసనలు తెలియజేయాలని నిర్ణయించింది.