'యోగాంధ్ర' లక్ష్యం 10 రోజులు ముందే సాధించామని మంత్రి సత్యకుమార్ బుధవారం తెలిపారు. 2 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 2,04,64,831 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. ప్రధాని మోదీ యోగ సంకల్పానికి ఇది ప్రతిఫలమని, సీఎం చంద్రబాబు కృషికి ప్రజల స్పందన ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. జూన్ 21న విశాఖలో యోగా దినోత్సవం జరగనుంది.