గుంటూరు రేంజ్ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు

71చూసినవారు
గుంటూరు రేంజ్ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు
గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో గురువారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జాతీయ పతాకావిష్కరణ చేసి వందన సమర్పణ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో పోరాటం ఫలితంగా స్వాతంత్య్రం లభించిందని, వారి పోరాటాలు, త్యాగాలను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, ఏఆర్ డీఎస్పీ శాంతకుమార్, ఆర్ ఐ లు శ్రీనివాసరావు, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్