గుంటూరులో రేపు జాబ్ మేళా

64చూసినవారు
గుంటూరులో రేపు జాబ్ మేళా
గుంటూరు గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫెయిర్ డీల్ క్యాపిటల్, హెచ్-1 హెచ్ఆర్ సొల్యూషన్స్, కేప్షన్ సర్వీసెస్, ఫ్లిప్ కార్డ్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువత జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్