హైదరాబాద్‌లో సోమవారం ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలించారు. ఆయన రాత్రి నల్లపాడు స్టేషన్‌లోనే ఉండనున్నారు. రేపు ఉదయం మంగళగిరి కోర్టులో ఆయనను పోలీసులు హాజరుపరచనున్నట్టు సమాచారం.