గుంటూరు జీజీహెచ్‌కు కృష్ణంరాజు

68చూసినవారు
గుంటూరు జీజీహెచ్‌కు కృష్ణంరాజు
అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజును వైద్య పరీక్షల నిమిత్తం గురువారం మధ్యాహ్నం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బుధవారం విశాఖ సమీపంలోని తగరపువలసలో అరెస్టు చేసిన తుళ్లూరు పోలీసులు అర్ధరాత్రి నల్లపాడు పీఎస్‌కు తీసుకువచ్చారు. నేడు మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. అమరావతి ఐకాస దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుపై తుళ్లూరులో నమోదైన కేసులో కృష్ణంరాజే ఏ1 ఏ2గా కొమ్మినేని శ్రీనివాసరావు.

సంబంధిత పోస్ట్