తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గుంటూరు రింగ్ రోడ్డులోని సిద్ధార్థ గార్డెన్స్ వేదికగా సాయంత్రం 6గంటల నుంచి కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించినుసంబంధించిన ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని మోహన కృష్ణ పిలుపునిచ్చారు.