ఘనంగా నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

58చూసినవారు
ఘనంగా నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం గుంటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. అనంతరం ఆమె కేక్ కట్ చేసి, నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ బాలయ్య సినీ రంగంలో ఆయన నటనతో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్