పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఆదివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత ప్రభుత్వం ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని, ఇప్పటి కూటమి ప్రభుత్వం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.