నగరంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: ఎమ్మెల్యే మాధవి

66చూసినవారు
నగరంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: ఎమ్మెల్యే మాధవి
గుంటూరులో పెండింగ్ పనులపై కార్పొరేషన్ అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రహదారులు, డ్రైన్లు, పారిశుద్ధ నిర్వహణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే మాధవి తెలిపారు.

సంబంధిత పోస్ట్