అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో పీటీ వారెంటుతో గుంటూరు పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనను గుంటూరుకు తరలించి కోర్టులో హాజరుపర్చనున్నారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో ప్రైవేట్ టోల్ గేట్ ఏర్పాటుపై కూడా కేసు నమోదై ఉంది.