గుంటూరులో నిషేధిత వెబ్‌సైట్‌లపై లైవ్ న్యూడ్ వీడియోలు ప్రసారం చేస్తున్న ముఠాను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఐజీ రవికృష్ణ తెలిపిన వివరాల మేరకు. గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో శ్రీకాకుళం, గుంతకల్లుకు చెందిన ముగ్గురు నిందితులు గణేశ్, జ్యోత్స్న, లౌయిస్ అరెస్ట్ అయ్యారన్నారు. ఇప్పటి వరకు 3 కేసులు నమోదు అయ్యాయని, ముఠా మరెంత మంది బాధితులను టార్గెట్ చేసిందన్న విషయంపై విచారణ కొనసాగుతోందన్నారు.