గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డేకి విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు గ్రీవెన్స్ డే కి తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఇతర అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూముల వివాదాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి.