తల్లికి వందనం పథకం పూర్తిగా అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి కిరణ్ విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. రూ.15 వేలు ఇవ్వాలి అని చెప్పి రూ.13 వేలు ఇచ్చారని, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పథకాలు సక్రమంగా అమలుచేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.