వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష గురువారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో సజ్జలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన తాడేపల్లి ఎస్ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.