వరద బాధిత కుటుంబాలకు పంపిణీ చేసేందుకు గుంటూరు పౌరసరఫరాల గిడ్డంగిలో సిద్దమవుతున్న నిత్యావసర కిట్ల ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం పరిశీలించారు. గుంటూరు రూరల్, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన 2, 700 కుటుంబాలకు ఈ కిట్లు పంపిణీ చేయనునట్లు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నామని తెలిపారు.