చైత్రమాసం చతుర్థి సందర్భంగా శలపాడు శ్రీ గంగా పార్వతి సమేత చంద్రశేఖర స్వామి, రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ పరిసరాలు మంగళవాద్యాలతో మార్మోగాయి. ప్రత్యేక పూజలు, హోమాలు, కళ్యాణోత్సవం వేడుకగా జరగగా, భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.