వీసి కార్యాలయానికి తాళం వేసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు

68చూసినవారు
వీసి కార్యాలయానికి తాళం వేసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వీసి కార్యాలయానికి శనివారం టీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు తాళం వేసి ఆందోళన చేశారు. రాష్ట్రం లో కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని విశ్వవిద్యాలయాల వీసి లు రాజీనామ చేస్తున్న తరుణంలో నాగార్జున విశ్వవిద్యాలయం వీసి కూడా రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తూ వీసి కార్యాలయానికి వచ్చి తాళం వేశారు. ఈ సమయంలో వీసి కార్యాలయ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ సమయంలో వీసి రాజశేఖర్ కార్యాలయంలో లేరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్