గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షల ముగింపు బుధవారం జరగనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి మార్కెట్, బస్టాండ్ మీదుగా పాదయాత్ర సాగుతుందన్నారు.