కృషి విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు

65చూసినవారు
కృషి విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు
గుంటూరు రూరల్ మండలం లాంఫామ్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో గ్రామీణ యువతకు ఆరురోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేవీకే ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ ఎం. యుగంధర్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 20వ తేదీవరకు ఆరు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో వానపాముల నుంచి ఎరువు తయారీపై శిక్షణ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్