విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో నిరసన దీక్ష నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్షలను డాక్టర్ కొల్లా రాజమోహన్ పూలమాలలు వేసి ప్రారంభించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో వేలాది మంది ప్రాణత్యాగం చేశారని, ముఖ్యంగా విద్యార్థి, యువత పాత్ర కీలకమని గుర్తు చేశారు. అటువంటి విశాఖ ఉక్కను ప్రైవేటీకరిస్తే సహించబోమని హెచ్చరించారు.