ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం పార్టీ నేతలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.