కారంపూడికి చెందిన టీడీపీ ఆర్యవైశ్య నేత కర్నాటి గోపాలకృష్ణ పెనుగొండ శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. కారంపూడి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర మంగళవారం సాయంత్రం పిడుగురాళ్లకు చేరుకున్నారు. కూటమి నేతలు ఈ పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో గోపాలకృష్ణ పాదయాత్ర చేపట్టారు.