పిడుగురాళ్ల: రెండు రోజులు కంటిన్యూ డ్రైవింగ్ వల్ల ప్రమాదం: పల్నాడు ఎస్పీ

78చూసినవారు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా రెండు రోజులుగా విరామం లేకుండా ఒకే వ్యక్తి డ్రైవింగ్ చేయడం వలనే ప్రమాదం జరిగిందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. పలు పుణ్య క్షేత్రాలు దర్శించి, త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఆత్రుతతో ఓకే వ్యక్తి డ్రైవింగ్ చేశాడన్నారు. నిద్ర మత్తులో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్