గురజాల తహశీల్దార్ గా కుటుంబరావు మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు దాచేపల్లి తహశీల్దార్గా కుటుంబరావు విధులు నిర్వహించారు. సాధారణ బదిలీలలో భాగంగా సీసీఎల్ఎ సూచన మేరకు ఆయనను గురజాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.