పిడుగురాళ్లలో పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రైమరీ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్య తను పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.