గురజాల పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐగా ఆవుల భాస్కరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాల పట్టణంలో రోడ్డుపై ఉన్న ద్విచక్రవాహనాలు, తోపుడు బండ్ల వారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉంచాలన్నారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో తప్పకుండా పోలీసుల నియమ నిబంధనలు తప్పక పాటించాలి అని అన్నారు.