రానున్నది కూటమి ప్రభుత్వమే: యరపతినేని

27896చూసినవారు
సైకో జగన్ ను రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంప్ స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గురజాల అసెంబ్లీ కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాల మండలంలోని జంగమహేశ్వర పురం, చర్లగుడిపాడు గ్రామాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జంగమహేశ్వరపురంకు వచ్చిన యరపతినేని ప్రజలు బాణాసంచా కాల్పులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని పలు వీధుల్లో ఆయన తిరుగుతూ మేనిఫేస్టోను వివరిం చారు. అనంతరం చర్లగుడిపాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యరపతినేనిని ఆ గ్రామ ప్రజలు గజమాలలతో స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. గ్రామమంతా పసుపుమయంగా మారింది. యువత కేరింతలు కొట్టారు.

సంబంధిత పోస్ట్