దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు హైవే మీద కరెంటు స్తంభాలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కౌన్సిలర్ షేక్ షరీఫ్ తెలిపారు. గురువారం దాచేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. హైవే పై కరెంట్ లేని కారణంగా చిమ్మ చీకట్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు.