దాచేపల్లి: ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి: ఏవో

76చూసినవారు
దాచేపల్లి: ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి: ఏవో
ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు రైతు సేవా కేంద్రాలలో రైతులు డబ్బులు చెల్లించవలసిన పనిలేదని దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి పాప కుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఉచితంగా విశిష్ట సంఖ్యను నమోదు చేసుకోవాలన్నారు. రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ రిజిస్ట్రేషన్) పొందటం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందుటకు అర్హులు అవుతారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏవో కోరారు.

సంబంధిత పోస్ట్