ప్రభుత్వ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష తేదీ మారినట్లు దాచేపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్. రవికుమార్ శుక్రవారం తెలిపారు. తొలుత ఈనెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించామన్నారు. అయితే 20న ఈస్టర్ పండగ రావడంతో ఈనెల 21 న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ అయినట్లు ప్రిన్సిపాల్ వివరించారు.