దాచేపల్లిలో బుధవారం పోలీసులు హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల డీఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో 99 శాతం వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన తలకు బలమైన గాయాలు తగిలి చనిపోతున్నారన్నారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రజల్లో అవగాహన కలిపించవలసిన అవసరం ఉందన్నారు. దాచేపల్లి సీఐ భాస్కర్, ఎస్ఐ సౌందర్య రాజన్ పాల్గొన్నారు.