పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో పట్టపగలే దొంగతనం జరిగింది. గురువారం ఉదయం గ్రామంలో చొరబడిన దొంగలు ఒక ఇంటి నుంచి 2 లక్షలు డబ్బులు, 10 సవర్ల బంగారం దొంగిలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.