జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దాచేపల్లి మండలం శ్రీనగర్లోని ఓ సిమెంట్స్ ఫాక్టరీలో హెల్మెట్ ఆవశ్యకతపై పోలీసులు అవగాహన కల్పించారు. దాచేపల్లి సీఐ భాస్కర్ పర్యవేక్షణలో సోమవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.