దాచేపల్లి మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీలలో ఈనెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మండల తహశీల్దార్ కార్యాలయం అధికారులు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, మ్యుటేషన్లు, ఎస్ఈసీ కార్డుల మంజూరు, భూ తగాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు అలాగే ప్రజా సమస్యలపై పరిష్కారం చూపుతారని అధికారులు పేర్కొన్నారు.