పాఠశాలలో విద్యాబోధన నాణ్యతను తల్లిదండ్రులు తప్పక పరిశీలించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం పిడుగురాళ్ల మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు.