పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 26, 000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలుకావాలి, పర్మినెంట్ చేయాలి, సెలవులు వర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్లతో వినతిపత్రాన్ని కమిషనర్ పర్వతనేని శ్రీధర్‌కు అందజేశారు.