రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రత్యేకమైన సామాజిక వర్గం ఆర్యవైశ్యులు అని జనసేన గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు అన్నారు. శుక్రవారం గురజాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినం వేడుకలలో ఆయన మాట్లాడారు. ముందుగా దేవాలయంలో కూటమి నేతలు జి. లక్ష్మీనారాయణ, అంకారావు, నేలవల్లి బొల్లయ్య, ఆర్యవైశ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.