గురజాల: "కూటమి నేతలు సహాయక చర్యలు చేపడతారు"

52చూసినవారు
పల్నాడులో ప్రసిద్ధిగాంచిన పుణ్య క్షేత్రం దైద అమరలింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలలో కూటమి నేతలు సహాయక చర్యలు చేపడతారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం దైద బిలం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అధికారులతో పాటు కూటమి నేతలు మూడు షిఫ్టులు డ్యూటీ చేసి భక్తులకు సౌకర్యాలు అందిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్