గురజాల జనసేన నేత శ్రీనివాస్‌రావుపై ప్రమీల అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం యాక్సిడెంట్ కేసులో ఉన్న తన కుమారుడికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పి రూ.46 లక్షలు డిమాండ్ చేశారని అందులో రూ.14 లక్షలు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. తాను న్యాయం కోరుతున్నానని తన డబ్బులు తిరిగి ఇప్పించాలని ఆమె కోరారు.