కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పంటకూ సరైన గిట్టుబాటు ధర లేదని, రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పొగాకు రైతుల సమస్యలను తెలుసుకొని వారికి మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ దర్శికి రావటం జరిగిందన్నారు. తమ నాయకుడు ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తారన్నారు.