ఇటీవల పూర్తిస్థాయి రాష్ట్ర డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయనను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీజీపీని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.