గురజాల మండల వ్యవసాయ శాఖ ఏవోగా గురువారం వై, పుల్లారెడ్డి నూతన బాధ్యతలు చేపట్టడం జరిగింది. గతంలో వెల్దుర్తి మండలంలో పనిచేస్తూ బదిలీపై గురజాల మండలానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రైతులు అన్నదాత సుఖీభవ కోసం ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. తమ గ్రామాల్లో ఉన్న రైతుభరోసా కేంద్రాలలో తమ సిబ్బందిని రైతులు సంప్రదించాలన్నారు.