గురజాల: జనసేన నేతపై మహిళ ఫిర్యాదు

77చూసినవారు
గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు జనసేన పార్టీ పేరుతో ప్రజలకు న్యాయం చేస్తానని రూ. 50 లక్షలు మోసం చేసాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఘర్షణ జరిగిన సంఘటనలో బెయిల్ ఇప్పిస్తాను అని సుమారు రూ. 50 లక్షలు బేరం కుదుర్చుకొని, బెయిల్ రాకపోగా తిరిగి డబ్బులు అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అని బాధితులను బెదిరిస్తున్నాడని పేర్కొంది. మంగళవారం గ్రీవెన్స్ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీకి సదరు మహిళ అంకారావుపై ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్