పల్నాడు జిల్లా వ్యాప్తంగా పత్తి పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ క్రమంలో గురజాల నియోజకవర్గంలో మాచవరం, గురజాల, దాచేపల్లి, మండలాల పరిధిలో భారీగా కురిసిన వర్షాలకు పత్తి పంట చీడపీడలు ఎక్కువగా ఆశించి దిగుబడి తగ్గిందని రైతులు గురువారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పత్తి పంటను కాకుండా మినుము పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.