పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 9వ తేదీన, మంగళవారం అప్రెంటిస్ మేళా జరుగుతుందని ఐటీఐ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు ఓ ప్రకటనలో తెలియచేశారు. ఆయన మాట్లాడుతూ వివిధ రకాల ప్రముఖ కంపెనీలు ఈ మేళాకు హాజరవుతున్నాయని అన్నారు. ఐటీఐ అన్ని ట్రేడుల విద్యార్థులు ఈ మేళాకు హాజరు కావచ్చని తెలియచేశారు.