దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ శైవ క్షేత్రం పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు టీటీడీ పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి తెలిపారు.గురువారం దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. కార్యక్రమములో టీటీడీ చైర్మన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. 14, 15, 16 తేదీల్లో ప్రతిష్ఠ కు సంబంధించి జరిగే కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.